తిరుమలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ .. ఎప్పుడంటే?

తిరుమల తిరుపతి దేవస్థానం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2026-01-09 06:02 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలో ఉద్యోగాల భర్తీకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఓకే చెప్పింది. అనేక ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పెండింగ్ లో ఉన్న పోస్టులను భర్తీ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిర్ణయించారు. అయితే ఇందుకు అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు.

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి...
గత నెల 16వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం తీసుకున్న నిర్ణయం మేరకు ఉద్యోగ నియామకాలతో పాటు పదోన్నతులు కల్పించేందుకు అనుమతించింది. సర్వీసు నిబంధనలను సవరించడానికి అంగీకారం తెలిపింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే ఉద్యోగాల నియామకాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది.


Tags:    

Similar News