తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం

తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మునోత్ ఇండ్రస్ట్రీస్ లో జరిగిన ఈ ప్రమాదంలో యాభై కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు ప్రాధమికంగా నిర్ణయించారు

Update: 2025-09-18 04:37 GMT

తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మునోత్ ఇండ్రస్ట్రీస్ లో జరిగిన ఈ ప్రమాదంలో యాభై కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు ప్రాధమికంగా నిర్ణయించారు. రేణిగుంట ఎయిర్ పోర్టు సమీపంలోని మునోత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరగడంతో విమానాల రాకపోకలకు ఆలస్యం ఏర్పడింది.

యాభైకోట్ల నష్టం...
లిథియం ఆయాన్ బ్యాటరీల కర్మాగారంలో మంటలు చెలరేగిన సమాచారం అందుకుని తొమ్మిది 9 ఫైర్ ఇంజన్లతో ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. సహాయక చర్యల్లో ఏర్పేడు పోలీసులు కూడా పాల్గొన్నారు. అయితే రాత్రి సమయంలో ఘటన జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, భారీగా ఆస్తినష్టం సంభవించిందని తెలిపారు.


Tags:    

Similar News