Breaking : మోస్ట్ వాంటెడ్ టెక్ శంకర్ మృతి... మరో భారీ ఎన్ కౌంటర్
అల్లూరి సీతారామ జిల్లాలో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు మరణించారు.
అల్లూరి సీతారామ జిల్లాలో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు మరణించారు. మారేడుమిల్లిలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు చనిపోయారు. మృతుల్లో మెట్టూరు జోగారావు, అలియాస్ టెక్ శంకర్ కూడా ఉన్నారు. రెండు ఏకే 47 లతో పాటు మరికొన్ని ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జ్యోతి, సురేష్,గణేశ్, శ్రీను, షైను, అనిత, షమ్మి కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఐఈడీ బాంబులు పేల్చడంలో
టెక్ శంకర్ ఐఈడీ బాంబులు పేల్చడంలో దిట్ట. టెక్ శంకర్ ఆంధ్రా ఒడిశా స్పెషల్ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. నాటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోము కాల్చివేతలో కూడా ప్రధాన పాత్ర పోషించారని చెబుతున్నారు. ఐఈడీ బాంబులను తయారు చేసి వాటిని పేల్చడంలో టెక్ శంకర్ దిట్ట అని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాలను రాజమండ్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. నిన్న ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత తప్పించుకున్న వారిని నేడు ఎన్ కౌంటర్ లో హతమార్చారు.