తూర్పు గోదావరి జిల్లాలోకి మహా పాదయాత్ర

తూర్పు గోదావరి జిల్లాలోకి అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రవేశించింది. నేడు 22వ రోజుకు పాదయాత్ర చేరుకుంది.

Update: 2022-10-04 06:02 GMT

తూర్పు గోదావరి జిల్లాలోకి అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రవేశించింది. నేడు 22వ రోజుకు పాదయాత్ర చేరుకుంది. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు గత నెల 12వ తేదీన అమరావతిలో మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 60 రోజులు పాదయాత్ర చేసి శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లికి చేరుకుంటారు. దారి పొడవునా రైతులకు అనేక పార్టీలు సంఘీభావం ప్రకటిస్తున్నాయి.

ఉద్రిక్తతల మధ్య....
రాళ్లకుంట, అయ్యవరం, కొత్తగూడెం మీదుగా దూబచర్ల వరకూ సాగిన పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అయితే అధికార వైసీపీ ఎక్కడికక్కడ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తుండటంతో కొంత ఉద్రిక్తత తలెత్తే అవకాశముందని భావించిన పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.


Tags:    

Similar News