నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
నేటి నుండి శ్రీశైలం లో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి
నేటి నుండి శ్రీశైలం లో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు నుంచి వచ్చే నెల ఒకటోతేదీ వరకూ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మొత్తం పదకొండు రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంగరంగ వైభవంగా భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్ల బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు చేరుకోనున్నారు.
నేటి ఉదయం నుంచి...
ఈరోజు ఉదయ యాగశాల ప్రవేశముతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మార్చి 1వ తేదీన రాత్రి జరిపే పుష్పోత్సవ, శయనోత్సవాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 22వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం వారి స్వామి అమ్మవార్ల కు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 23వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.