Srikala Hasthi : నేటి నుంచి శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి

Update: 2025-02-21 04:25 GMT

నేటి నుంచి శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తొలుత స్వామి వారి పూజలు నిర్వహించనున్నారు. భక్తకన్నప్ప ధ్వజారోహణంతో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అభిషేక సేవలు, అంతరాలయం దర్శనాలను అధికారులు రద్దు చేశారు.

భక్తులు అధిక సంఖ్యలో...
శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మహా శివరాత్రికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారని భావించి అందుకు సంబంధించిన ముదస్తు ఏర్పాట్లను ఆలయ కమిటీ అధికారులు చేశారు. తొక్కిసలాట జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News