నాలుగో రోజుకు చేరిన రైతుల పాదయాత్ర

రాజధాని రైతుల మహా పాదయాత్ర కొనసాగుతుంది. నేడు నాలుగో రోజుకు యాత్ర చేరుకుంది. ఈరోజు గుంటూరు జిల్లాలో యాత్ర సాగనుంది.

Update: 2022-09-15 03:17 GMT

రాజధాని రైతుల మహా పాదయాత్ర కొనసాగుతుంది. నేడు నాలుగో రోజుకు యాత్ర చేరుకుంది. ఈరోజు గుంటూరు జిల్లాలో యాత్ర సాగనుంది. పెదరావూరు నుంచి వేమూరు మీదుగా నేడు కొల్లూరు వరకూ పాదయాత్ర సాగనుంది. మూడు రాజధానులు వద్దని, ఏకైక రాజధాని ముద్దంటూ ఈ యాత్రను రైతులు చేపట్టారు. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర మధ్యాహ్నం భోజన విరామ సమయానికి ఆగుతారు. అనంతరం సాయంత్రం ఆరు గంటల వరకూ యాత్ర కొనసాగుతుంది.

బౌన్సర్లతో భద్రత.....
పాదయాత్ర కు పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనికి తోడు రాజధాని అమరావతి పరిరక్షణ సమితి రక్షణ కోసం ప్రత్యేకంగా బౌన్సర్లను నియమించుకుంది. వారి రక్షణ కూడా తీసుకుని యాత్ర ముందుకు సాగనుంది. నిన్న తెనాలి ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత తలెత్తినా వెంటనే సర్ది చెప్పడంతో శాంతించిన రైతులు తిరిగి పాదయాత్రను కొనసాగించారు. రోజుకు పది నుంచి పన్నెండు కిలోమీటర్ల మేర వారి ప్రయాణం సాగుతుంది.


Tags:    

Similar News