Magunta : ఒంగోలు ఎంపీ మాగుంట కీలక ప్రకటన

ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కీలక ప్రకటన చేశారు

Update: 2025-10-15 06:53 GMT

ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నియజకవర్గం నుంచి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. తాను మొన్నటి ఎన్నికల్లోనే రాఘవరెడ్డిని పోటీ చేయించాలని భావించానని, అయితే చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాను పోటీ చేశాననిమాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో...
ఒంగోలు నియోజకవర్గంలో ఇంత కాలం తన సోదరుడు మాగుంట సుబ్బరామిరెడ్డిని, తనను ప్రజలు ఆదరించారని, రాఘవరెడ్డిని కూడా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం ప్రజలు ఆదరిస్తారని మాగుంట శ్రీనివాసులు రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను రాజకీయంగా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నానని, అందుకే రాఘవరెడ్డిని ఎన్నికల బరిలో నిలపాలని నిర్ణయించుకున్నట్లు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.


Tags:    

Similar News