కడప రెడ్డమ్మ కుర్చీ గోల... కంటిన్యూ అవుతున్నట్లుందిగా

మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన మాధవి రెడ్డి కుర్చీ కొట్లాట వదలడం లేదు. కంటిన్యూ అవుతూనే ఉంది.

Update: 2025-08-16 07:11 GMT

మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన మాధవి రెడ్డి కుర్చీ కొట్లాట వదలడం లేదు. నిన్న మొన్నటి వరకూ కార్పొరేషన్ లో మేయర్ సురేష్ బాబు వేదికపై కుర్చీ వేయలేదంటూ ఆగ్రహించి ఆయనను పదవి నుంచి తొలగించిన కడప రెడ్డమ్మ ఈసారి ఏకంగా స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అధికారులతో పేచీ పెట్టుకున్నారు. కడప పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మాధవి రెడ్డి హాజరయ్యారు. అయితే ఆమె వచ్చేసరికి వేదికపై కుర్చీ లేదు. అయితే ప్రొటోకాల్ ప్రకారం అధికారులు, మంత్రులకు మాత్రమే చోటు ఉంటుందని ఉన్నతాధికారలుు చెప్పినా ఆమె వినలేదు. తనకు కుర్చీ వేయకపోవడంపై ఆమె అక్కడే ఉండి నిరసన తెలియజేశారు.

జేసీని నిలదీసి...
అంతే కాదు జాయింట్ కలెక్టర్ అతిధి సింగ్ ను నిలదీయడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా ప్రొటోకాల్ ప్రకారం అధికారులు వేదికపై కుర్చీలు వేస్తారు. కానీ మాధవి రెడ్డి మాత్రం వెరీ వెరీ స్పెషల్ గా కనిపిస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో తలెత్తని సమస్య ఒక కడప జిల్లాలోనే ఎందుకు ఎదురువతుందని టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేను రాష్ట్రంలో ఎక్కడా వేదికపైకి అనుమతించరు. మంత్రులు, ఉన్నతాధికారులు మాత్రమే స్టేజీపై ఉంటారు. ఆ విషయం సౌమ్యంగా చెప్పినా వినిపించుకోని మాధవి రెడ్డి తనకు అవమానం జరిగిందని ఫీలవుతూ కొద్దిసేపు తన భర్తతో కలిసి అక్కడే నిలబడి వేడుకలు ముగియకముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఎవరు చెప్పినా...?
తర్వాత జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తో పాటు జాయింట్ కలెక్టర్ అతిధి సింగ్ కూడా కుర్చీ వేయించి రావాల్సిందిగా రావాలని కోరినా ఆమె వినకుండా అక్కడి నుంచి విసవిసా వెళ్లిపోయారు. అలిగి వెళ్లిపోతే ఎవరికి నష్టం? గతంలో కార్పొరేషన్ లో రగడ చేసినా అక్కడ ఉన్నది ప్రతిపక్ష మేయర్ కావడంతో పార్టీ నాయకత్వం కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఏకంగా అధికారులపైనే చిందులు తొక్కడమేంటని టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలకు వేదికపై చోటు కల్పించాలంటే కష్టమని చెబుతున్నప్పటికీ ఆమె కు చెప్పేవారే అక్కడ లేరు. చెప్పినా వినిపించుకునే స్థితిలో లేరు. మొత్తం మీద కడప ఫస్ట్ టైం ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాత్రం తరచూ వివాదాలతో.. కుర్చీ కొట్లాటలతో వార్తలకు ఎక్కుతుండటం అధిష్టానానికి తలనొప్పిగా మారింది.


Tags:    

Similar News