ఉప్పాడ తీరంలో ఎగిసిపడుతున్న అలలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కోనసీమ జిల్లాలపై కూడా చూపుతుంది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు పెద్దయెత్తున ఎగిసి పడుతున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కోనసీమ జిల్లాలపై కూడా చూపుతుంది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు పెద్దయెత్తున ఎగిసి పడుతున్నాయి. ఉప్పాడ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ తీరంలో అలలు ఎగిసిపడుతుండటంతో రహదారికూడా కోతకు గురయింది.
రహదారి రాకపోకలకు...
ఉప్పాడ నుంచి కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని వాకలపూడి వరకూ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఆ రహదారి ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచే అవకాశాలున్నాయంటున్నారు. రహదారిపై వేసిన రాళ్లు కూడా కససముద్ర అలల తాకిడికి కొట్టుకుపోతుండటంతో భారీ గుంటలు ఏర్పడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది.