Tirumala :తిరుమలలో చిరుతపులి .. భయాందోళనలో భక్తులు
తిరుమలలో చిరుత పులి సంచారం కలకలం రేపింది.
తిరుమలలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. తిరుపతి జూ పార్క్ రోడ్డులో సంచరించిన చిరుతపులి తర్వాత ఈరోజు తెల్లవారు జామున అలిపిరి వద్ద గాలిగోపురం వద్ద కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. పులిని చంపేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చిరుతపులి సంచారం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
భయాందోళనలో భక్తులు...
దీంతో దుకాణదారులతో పాటు భక్తులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో టీటీడీ అధికారులు విజిలెన్స్ అధికారులతో పాటు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే కాలినడకన వెళ్లే భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. భక్తులు గుంపులుగా వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు.