పోలవరం ముంపు ప్రాంతాల్లో చిరుత పులులు
పోలవరం ముంపు ప్రాంత గ్రామాల్లో చిరుత పులుల సంచారం ఎక్కువగా ఉంది.
చిరుత పులుల సంచారం ఎక్కువగా ఉంది. ఎండలు ముదిరిపోతుండటంతో నీటి కోసం జనావాసాలకు వస్తున్నాయి.దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అనేక ప్రాంతాల్లో చిరుత పులుల సంచారం ఉండటంతో అటవీ శాఖ అధికారుల అప్రమత్తమై ప్రజలను అలెర్ట్ చేస్తున్నారు. రాత్రివేళ ఒంటరిగా బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
అక్కడే ఆహారం.. నీటి కోసం...
తాజాగా పోలవరం ప్రాజెక్టు ఎగువన ఖాళీ చేయించిన ముంపు ప్రాంతాల్లో చిరుత పులుల సంచారం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ముంపు గ్రామాల్లో సంచరిస్తూ. ఆ ప్రాంతాల్లో దొరుకుతున్న ఆహారాన్నిచిరుతలు తీసుకుంటున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎగువన ముంపు గ్రామాల్లో ట్రాప్ కెమెరాలో చిరుత పులుల చిక్కాయి. మంచినీటి కోసం గోదావరి నదికి వెళుతున్న చిరుత ఫొటోలు కూడా లభించడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.