కల్యాణదుర్గంలో చిరుతపులి సంచారం..మేకలను చంపి
కల్యాణదుర్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. కల్యాణదుర్గం మండలంలో గత కొంతకాలంగా చిరుతపులి సంచరిస్తుంది
leapord in adilabad district
కల్యాణదుర్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. కల్యాణదుర్గం మండలంలో గత కొంతకాలంగా చిరుతపులి సంచరిస్తుంది. తాజాగా కల్లుమర్రి గ్రామంలో రెండు మేకలను చంపి పులి తినేసింది. దీంతో మేకల యజమాని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన అధికారులు పులి ఇక్కడే తిరుగుతుందనిన నిర్ధారించారు.
ఎవరూ వెళ్లవద్దంటూ...
పశులను, పెంపుడు జంతువులను సాయంత్రం వేళ పొలాలకు తీసుకెళ్లవద్దని అధికారులు సూచించారు. అలాగే గ్రామస్థులు కూడా సాయంత్రం నాలుగు గంటలు దాటిన తర్వాత ఎవరూ పొలాలకు వెళ్లవద్దని తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని, చిరుతపులిని పట్టుకునేంత వరకూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు గ్రామంలో చాటింపు వేయించారు.