Tirumala: తిరుమల నడక మార్గంలో చిరుత
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది.
అలిపిరి నడక మార్గంలోని ఏడో మలుపు వద్ద నడకదారిన వెళుతున్న భక్తులకు చిరుత కనిపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ విషయాన్ని తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు తెలిపారు.
భయాందోళనలో భక్తులు...
టీటీడీ అధికారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు వచ్చిన అటవీ శాఖ అధికారులు చిరుత ఆనవాళ్లను గుర్తించే పనిలోఉన్నారు. చిరుత కదలికల పట్ల భక్తులను టీటీడీ అప్రమత్తం చేస్తుంది. ఒంటరిగా కాలి నడకన రావద్దని, గుంపులుగా రావాలంటూ అలిపిరి, శ్రీవారిమెట్ల మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు సూచిస్తుంది.