ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ వద్ద సంచరిస్తున్న చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. మూడు నెలలుగా ఈ ప్రాంతవాసులను చిరుతపులి ముప్పుతిప్పలు పెట్టింది.
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ వద్ద సంచరిస్తున్న చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. మూడు నెలలుగా ఈ ప్రాంతవాసులను చిరుతపులి ముప్పుతిప్పలు పెట్టింది. ఎస్వీయూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వెనక వైపు ఉంచిన బోనులో వచ్చి చిరుతపులి చిక్కకుంది. గత కొద్ది నెలలుగా చిరుత పులి ఇక్కడే సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఎస్వీయూనివర్సిటీ వద్ద...
దీంతో అటవీ శాఖ అధికారులు చిరుతపులి సంచరింంచిన అనేక ప్రాంతాల్లో బోన్లను ఏర్పాటు చేశారు. ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఎవరూ రాత్రివేళ ఒంటరిగా వెళ్లవద్దని కూడా సూచించారు. దీంతో భయభయంగా ఆ ప్రాంత వాసులు గడుపుతున్నారు. చిరుతపులి చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. చిక్కిన చిరుతపులిని అటవీ శాఖ అధికారులు ఎస్వీ జూ పార్క్ కు తరలించారు. పులుల సంతానోత్పత్తి సమయం కావడంతో ఎక్కువగా జనారణ్యంలోకి వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.