Leopard : ట్రాప్ కెమెరాకు చిక్కిన చిరుతపులి

ప్రకాశం జిల్లాలో సంచరిస్తున్న చిరుతపులి ఎట్టకేలకు ట్రాప్ కెమెరాకు చిక్కింది. అటవీ శాఖ అధికారులు అమర్చిన ట్రాప్ కెమెరాల్లో చిరుతపులి కదలికలు కనిపించాయి

Update: 2025-08-18 04:31 GMT

ప్రకాశం జిల్లాలో సంచరిస్తున్న చిరుతపులి ఎట్టకేలకు ట్రాప్ కెమెరాకు చిక్కింది. అటవీ శాఖ అధికారులు అమర్చిన ట్రాప్ కెమెరాల్లో చిరుతపులి కదలికలు కనిపించాయి. చిరుతపులి ఇక్కడే సంచరిస్తుందని, ఎవరూ రాత్రి వేళ ఆరు బయట నిద్రించవద్దని, ఒంటరిగా అడవుల్లోకి వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇక్కడే చిరుతపులి సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. శ్రీశైలానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో చిన్నారుట్ల చెంచుగూడెం గ్రామంలో చిన్నారిపై చిరుతపులి దాడి చేసిన సంగతి తెలిసిందే.

చిన్నారిని లాక్కుని వెళ్లి...
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో అర్ధరాత్రి నిద్రిస్తున్న చిన్నారి పై చిరుతపులి దాడి చేసింది. సమీప అడవి నుంచి వచ్చిన చిరుత పులి తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లింది. పక్కనే ఉన్న తండ్రి గమనించి కేకలు వేసి చిరుతను వెంబడించడంతో గ్రామ శివారులో చిన్నారిని వదిలేసి వెళ్లింది. చిరుతపులి దాడిలో గాయపడిన చిన్నారిని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చిన్నారి బతికింది. అయితే అక్కడే చిరుపులి సంచరిస్తున్న విషయం ట్రాప్ కెమెరాకు చిక్కడంతో ప్రజలు దానిని పట్టుకోవాలని కోరుతున్నారు.


Tags:    

Similar News