పాణ్యం మండలంలో చిరుత సంచారం
పాణ్యం మండలంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది
leapord in tirumala
పాణ్యం మండలంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది. సుగాలి మెట్టలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద చిరుతపులి కనిపించింది. రెండు మేకలు, ఒక గొర్రెను చంపి తినడంతో గ్రామస్థులు భయందోళనలు చెందుతున్నారు. దీంతో చిరుత సంచారం గురించి అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు.
అటవీ శాఖ అధికారులు...
దీంతో అటవీ శాఖ అధికారులు వచ్చి అక్కడ చిరుత సంచారాన్ని పాదముద్రల ద్వారా గుర్తించారు. ప్రజలు ఎవరూ ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. పెంపుడు జంతువులను కూడా పొలాలకు తీసుకెళ్లవద్దని, పశువుల కాపర్లు కూడా పొలాలకు వెళ్లవద్దని తెలిపారు. పొలం పనులకు వెళ్లేవారు గుంపులుగా వెళ్లాలని చాటింపు వేయించారు.