ఎస్వీ యూనివర్సిటీలో చిరుతపులి
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది.
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. నిన్న సాయంత్రం చిరుత పులి కనిపించడంతో విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో యూనివర్సిటీ అధికారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇటీవల చిరుత తిరుపతి ప్రాంతంలో దాడి చేసి ముని అనే టీటీడీ ఉద్యోగి గాయపడిన సంగతి తెలిసిందే.
అక్కడే తిరుగుతుందని...
ఈ నేపథ్యంలో చిరుత పులి ఇక్కడే తిరుగుతుందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే విద్యార్థులు చిరుతపులి సంచారంతో విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు. చిరుత పులిని బంధించాలంటూ విద్యార్థులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. సాయంత్రం అయితే బయటకు రావడానికి భయపడిపోతున్నారు.