తిరుపతిలో చిరుత.. వేదిక్ వర్సిటీలో కనిపించిన చిరుత
తిరుపతిలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది
తిరుపతిలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. ఎస్వీ వేదిక్ యూనివర్సిటీలో మరోమారు చిరుత కనిపించడంతో స్థానికులతో పాటు విద్యార్థులు కూడా భయాందోళనలకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా చిరుతపులి ఇక్కడే తిరుగుతుంది. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చిరుత సంచారం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
అక్కడే కూర్చుని...
వేకువజాము ఉదయం ఫారెస్ట్ పాట్రోల్ వాహనానికి చిరుత ఎదురుపడింది. సైరన్ మోగిస్తూ చిరుతను అడవిలోకి తరిమి ప్రయత్నం సిబ్బంది చేశారు.అయితే చిరుతపులి ఏమాత్రం బెదరకుండా ....కూర్చున్న చోటు నుండి కదలకుండానే కూర్చుంది. దీంతో చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. విద్యార్థులు భయాందోళనల మధ్య బితుకుబితుకుమంటూ గడుపుతున్నారు.