Leopard : తిరుమలలో చిరుతపులి.. బైక్ పై వెళుతున్న వారిపై దాడిచేసి?
తిరుమలలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది. అలిపిరి ఎస్వీ జూపార్క్ వద్ద ఈ చిరుతపులి కనిపించింది.
తిరుమలలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది. అలిపిరి ఎస్వీ జూపార్క్ వద్ద ఈ చిరుతపులి కనిపించింది. ఆ రహదారిపై వెళుతున్న ద్విచక్ర వాహనదారులపై చిరుత దాడికి ప్రయత్నించింది. అయితే వాహనదారులు తృటిలో తప్పించుకున్నారు.దీంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యమంగా కాలినడకన తిరుమలకు చేరుకునే భక్తులు బృందాలుగా బయలుదేరి వెళ్లాలని కోరుతున్నారు.
రోడ్డుపక్కన కల్వర్టు పక్కనే...
రోడ్డు పక్కనే కల్వర్టు పక్కన దాక్కుని ఉన్న చిరుతపులి ద్విచక్ర వాహనం వచ్చిన వెంటనే వారిపైకి దూకేందుకు ప్రయత్నించింది. అయితే బైకు వేగాన్ని పెంచడంతో వారు తప్పించుకున్నారు. వెనక కారులో ఉన్న వారు వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇది వైరల్ గా మారింది. చిరుతపులి స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.