Leopard : తుప్పల్లో చిరుత.. కదలలేని స్థితిలో
కర్నూలు జిల్లాలో చిరుతపులి కదలేనిస్థితిలో పడి ఉంది. దీంతో దానిని చూసేందుకు ప్రజలు పెద్దయెత్తున తరలివస్తున్నారు
కర్నూలు జిల్లాలో చిరుతపులి కదలేనిస్థితిలో పడి ఉంది. దీంతో దానిని చూసేందుకు ప్రజలు పెద్దయెత్తున తరలివస్తున్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రానికి సమీపంలోని ఎర్రవంకలో చిరుత ఉన్నట్లు గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుతపులి అనారోగ్యంతో అక్కడ పడిపోయి కదనలేని స్థితిలో ఉండటంతో అక్కడ పెద్దయెత్తున జనం గుమికూడారు.
అనారోగ్యంతోనే....
పోలీసులు అక్కడకు చేరుకుని ప్రజలను దాని చెంతకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ప్రజలను దూరంగా పంపించి వేస్తున్నారు. చిరుతపులి పరిగెత్తలేని పరిస్థితుల్లోనే అలా పడి ఉందని, దానిని బంధించి తీసుకెళ్లి చికిత్స అందించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. చిరుత అనారోగ్యం పాలవ్వడానికి కారణాలుమాత్రం తెలియడం లేదు.