తిరుపతిలో చిరుత.. బోను వద్దకే వచ్చి?

తిరుపతి వేదిక్ యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం రేపింది. జింకలపై చిరుత దాడి చేసింది

Update: 2025-02-14 03:08 GMT

తిరుపతి వేదిక్ యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం రేపింది. జింకలపై చిరుత దాడి చేసింది. దీంతో యూనివర్సిటీ అధికారులతో పాటు సెక్యూరిటీ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గత కొన్నాళ్ల నుంచి వేదిక్ యూనివర్సిటీ వద్దనే చిరుతపులి తిరుగుతుంది. తాజాగా జింకలపై దాడి చేయడంతో వేదిక్ యూనివర్సిటీ విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు.

బోన్లు ఏర్పాటు చేసినా...
అటవీశాఖ సిబ్బంది ఏర్పాటు చేసిన బోను పక్కనే జింకపై చిరుత దాడి చేసింది. చిరుత పులి కోసం బోన్ ఏర్పాటు చేసినా అందులోకి వెళ్లకుండా పక్కనే తిరుగుతూ జింకలపై ట్రాప్ చేయడంతో మరికొన్ని బోన్లు ఏర్పాటు చేయాలని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. చిరుత జింకలపై దాడి చేస్తున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాలో రికార్డయ్యాయి.


Tags:    

Similar News