లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ డిమాండ్

ఏపీ మంత్రి నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలంటూ కడప జిల్లా నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు.

Update: 2025-01-18 12:27 GMT

ఏపీ మంత్రి నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలంటూ కడప జిల్లా నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబుకు ఆ జిల్లా టీడీపీ నేతలు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఎన్టీఆర్ వర్ధంతి సభలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కడప జిల్లాలో జరిగిన...
అయితే ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కడప జిల్లాకు చెందిన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ను ఉపముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. క్యాడర్ లో భరోసా నింపాలన్నా, యువతలో ఆత్మవిశ్వాసం పెరగాలన్నా నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలని ఆయన కోరడంతో మిగిలిన నేతలు కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. చంద్రబాబు మాత్రం దీనిపై స్పందించలేదు. మౌనంగానే ఉన్నారు.


Tags:    

Similar News