Janasena Party : జనసేనలో చేరిన కీలక నేతలు
జనసేన పార్టీలో వైసీపీకి చెందిన నేతలు చేరారు. మొన్నటి వరకూ వైసీపీలో ఉండి ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు
janasena party
జనసేన పార్టీలో వైసీపీకి చెందిన నేతలు చేరారు. మొన్నటి వరకూ వైసీపీలో ఉండి ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ముగ్గురు కీలక నేతలు పార్టీలో చేరారు. వీరిచేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పార్టీనేతలు భావిస్తున్నారు.
మూడు నియోజకవర్గాల నుంచి...
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, పొన్నూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యలు జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కండువా కప్పి సాదరంగా జనసేనలోకి ఆహ్వానించారు.