అందుకే వివేకాను చంపారు

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గల కారణాలను భాస్కర్ రెడ్డి తరుపున న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు

Update: 2023-04-11 12:26 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గల కారణాలను భాస్కర్ రెడ్డి తరుపున న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. ఇందులో కొత్త కోణాన్ని చూపారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి తరుపున న్యాయవాది వాదిస్తూ సునీల్ యాదవ్ తల్లిని వివేకానందరెడ్డి లైంగిక వేధింపులకు గురిచేశాడని అందువల్లనే సునీల్ యాదవ్ చంపాడని వాదించారు. తన తల్లిని లైంగికంగా వేధించినందునే దీంతో కక్ష కట్టి సునీల్ యాదవ్ వివేకా తలపై దాడి చేసి హత్య చేశాడని భాస్కర్ రెడ్డి తరుపున న్యాయవాది పేర్కొన్నారు.

గూగుల్ టేక్ ఔట్‌....
అలాగే ఈ కేసులో ఎస్పీ రాంసింగ్ వ్యవహారం‌పై సుప్రీంకోర్టుకు వెళ్లారని, రాంసింగ్ వ్యక్తి గతంగా టార్గెట్ చేసి తమను ఇరికిస్తున్నారని నిందితుడు భార్య తులసమ్మ వాదనలు వినిపించిందన్నారు. దీంతో రామ్ సింగ్ వ్యవహారం పై అనుమానాలు రావడం తో కొత్త విచారణాధికారిని నియమించిందన్నారు. కొత్తగా నియమించిన సిట్ వివరాల ఆర్డర్ కాపీ ఉందా అని వాదనలు విన్న న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రశ్నించింది. నూతనంగా నియమించిన సీబీఐ సిట్ టీమ్ అధికారుల వివరాలను పిటిషనర్ తరుపు న్యాయవాది ఇచ్చారు. గూగుల్ టేక్ ఔట్‌‌ను ఆధారంగా చేసుకొని ఎలా తమ క్లయింట్ ను కేసులో ఇరికిస్తారంటూ ప్రశ్నించారు. సీబీఐ, సునీత కలిసిపోయి దస్తగిరి‌ని అప్రూవర్‌గా మార్చారని వాదనల్లో ఆరోపించారు. తదుపరి విచారణ గురువారానికి న్యాయమూర్తి వాయిదా వేశారు.


Tags:    

Similar News