నేడు మురళి నాయక్ అంత్యక్రియలు

నేడు వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు అనంతపురం జిల్లాలోని ఆయన స్వగ్రామంలో జరగనున్నాయి.

Update: 2025-05-11 02:45 GMT

నేడు వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు అనంతపురం జిల్లాలోని ఆయన స్వగ్రామంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు హాజరు కానున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, సవిత, పయ్యావుల కేశవ్ లు ఈ అంత్యక్రియలకు హాజరు కానున్నారు. ఉదయం పదిన్నర గంటలకు మురళినాయక్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ప్రారంభమవుతాయని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

హాజరు కానున్న ఏపీ మంత్రులు...
ఇప్పటికే పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మురళి నాయక్ అంత్యక్రియల్లో పాల్గొంటారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలో అమరజవాను అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా దేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవాను మురళీనాయక్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు.


Tags:    

Similar News