కళ్లితండాలో పవన్ కల్యాణ్
వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన కళ్లితండాలో ప్రారంభమయ్యాయి
వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన కళ్లితండాలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, సవిత, అనిత, అనగాని సత్యప్రసాద్ లు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. పవన్ కల్యాణ్, లోకేశ్ లు మురళి నాయక్ తల్లిదండ్రులను ఓదర్చారు.
కుటుంబ సభ్యులను ఓదార్చిన...
మురళి నాయక్ చూపిన సాహసాన్ని ప్రశంసించారు. అదే సమయంలో ప్రభుత్వం కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలో అమరజవాను అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా దేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నారు.