Tirumala: తిరుమల లడ్డూ ఆల్ టైమ్ రికార్డు

తిరుమలలో లడ్డూల విక్రయం రికార్డు స్థాయికి చేరుకుంది. తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో లడ్డూల విక్రయాల సంఖ్య పెరిగింది

Update: 2025-08-22 03:56 GMT

తిరుమలలో లడ్డూల విక్రయం రికార్డు స్థాయికి చేరుకుంది. తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో లడ్డూల విక్రయాల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది జులై 12వ తేదీన ఒక్కరోజు 4,86,134 లడ్డూలను విక్రయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇది ఆల్ టైమ్ రికార్డు అని టీటీడీ అధికారులు తెలిపారు.

35 శాతం విక్రయాలు...
గత ఏడాది ఇదే రోజున3.24 లక్షల లడ్డూలను విక్రయించామని, ఈఏడాది అందులో 35 శాతం విక్రయాలు పెరిగాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఒక్కరోజులోనే దేవస్థానానికి లడ్డూల విక్రయం ద్వారా 2.43 కోట్ల రూపాయల ఆదాయంవచ్చిందని అధికారులు తెలిపారు. పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డూల తయారీ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.


Tags:    

Similar News