Kurnool Bus Accident : కర్నూలు ప్రమాదంలో సూపర్ ట్విస్ట్.. అదే కారణమా?

కర్నూలు బస్సు ప్రమాదంలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది

Update: 2025-10-25 05:08 GMT

కర్నూలు బస్సు ప్రమాదంలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. బైక్ మీద వస్తూ ప్రమాదానికి గురై ఇంత మంది మరణానికి కారణమైన శివశంకర్ మద్యం మత్తులో ఉన్నాడా? అంతకు ముందే రోడ్డు ప్రమాదం జరిగి అతను అక్కడ రోడ్డుపై పడి ఉన్నాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శివశంకర్ అక్కడి సమీపంలో పెట్రోలు బంకు వద్ద ఆగిన సీసీ టీవీ ఫుటేజీ దృశ్యాలు ఇందుకు ఊతమిస్తున్నాయి. ఈ బైకు మీద శివశంకర్ తో పాటు మరొక యువకుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ మద్యం తాగి వాహనం నడిపి ఏదైనా ప్రమాదానికి గురయ్యారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సీసీ టీవీ పుటేజీలో ...
సీసీ టీవీ పుటేజీలో కూడా శివశంకర్ బైక్ ను కొంత తూలుతూ నడుపుతున్నట్లు గమనించిన పోలీసులు పోస్టు మార్టం నివేదిక కోసం చూస్తున్నారు. అలాగే శివశంకర్ వెంట ఉన్న మరొక యువకుడు ఎవరన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అతను దొరికితే కాని అసలు ఏం జరిగిందన్నది అర్ధం కాదు. పెట్రోలు బంకు దగ్గర బైకుపై నుంచి పడిపోబోయిన శివశంకర్ నిలదొక్కుకుని ముందుకు వెళ్లడాన్ని కూడా పోలీసులు గుర్తించారు. అందుకే సమీపంలోని మద్యం దుకాణాల యాజమాన్యాలను కూడా పిలిపించి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. మద్యం తాగి అంతకు ముందే శివశంకర్ ప్రమాదానికి గురయ్యాడా? లేక బస్సు కింద పడ్డాడా? అన్నది నిర్ధారించాల్సి ఉంది.
మద్యం తాగి...
ఇక వర్షం పడుతుండటంతో మద్యం సేవించి రోడ్డుపైన శివశంకర్ పడిపోయి ఉండవచ్చని, వర్షానికి చూసుకోని వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అది చూసుకోకుండా పోవడం వల్లనే బస్సు కిందకు శివశంకర్ తో పాటు బైక్ కూడా వెళ్లి ఈ ఘోర ప్రమాదానికి గురయినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ణయానికి వచ్చారు. శివశంకర్ చివరి సారి కన్పించిన వీడియో 2.23 గంటలకు పెట్రోలు బంకు రావడంతో అక్కడ సీసీ టీపీ పుటేజ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ తర్వాతే బస్సు ప్రమాదం జరగడంతో ఈ ప్రమాదానికి ముఖ్యమైన కారణం శివశంకర్ అయి ఉండవచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. వారి బంధువులను రప్పించి శివశంకర్ తో పాటు ఉన్న యువకుడు ఎవరన్నది ఆరా తీస్తున్నారు.











Tags:    

Similar News