నేడు కుప్పం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక

ఈరోజు కుప్పం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది.

Update: 2025-04-28 02:17 GMT

ఈరోజు కుప్పం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. వైసీపీకి చెందిన సుధీర్ రాజీనామాతో ఈ ఎన్నిక జరగనుంది. సుధీర్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీలో మున్సిపల్ ఛైర్మన్ పదవికి కొత్త ఛైర్మన్ ను ఎంపిక చేయనున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి ఇప్పటికే నలుగురు కౌన్సిలర్లు చేరిపోయారు. ఎక్స్ అఫిషియోతో సభ్యులతో కలిపి టీడీపీకి పదకొండు మంది సభ్యులున్నారు.

వైసీపీకే బలం ఉన్నా...
కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి మాత్రం ఎక్స్ అఫిషియో సభ్యుడితో కలసి పదిహేను మంది సభ్యులు న్నారు. ఛైర్మన్ గా ఈ ఎన్నికల్లో గెలవాలంటే మ్యాజిక్ ఫిగర్ పథ్నాలుగు కావడంతో ఇప్పటికే పథ్నాలుగు ఓట్లకు పైగానే వైసీపీకి ఉన్నప్పటికీ అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కావడంతో ఏదైనా జరిగే అవాకవముందన్న అంచనాలు వినపడుతున్నాయి.


Tags:    

Similar News