మరోసారి అనిల్ కు పోలీసులు నోటీసులు

మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు రెండోసారి కోవూరు పోలీసుల నోటీసులు నోటీసులు జారీ చేశారు

Update: 2025-07-30 04:18 GMT

మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు రెండోసారి కోవూరు పోలీసుల నోటీసులు నోటీసులు జారీ చేశారు. తొలుత ఈరోజు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన పోలీసులు జగన్ పర్యటన నేపథ్యంలో వచ్చే నెల 4వ తేదీన విచారణకు రావాలని మరొక నోటీసులు ఇచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ ఒకసారి నోటీసులు ఇచ్చినా రాకపోవడంతో మరొక సారి నోటీసులు ఇచ్చారు.

వచ్చే నెల 4న హాజరు కావాలని...
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో A2గా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఇప్పటికే కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిని పోలీసులు విచారించి వదిలేశారు. అయితే అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరు కాలేదు. 4వ తేదీన విచారణకు వస్తారా? రారా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News