ఆ ఒక్క విషయంలో హైకమాండ్ ను తప్పపట్టిన రోశయ్య

కొణిజేటి రోశయ్య కు రాష్ట్ర విభజన ఇష్టం ఉండేది కాదు. సమైక్యంగానే ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరుకునే వారు.

Update: 2021-12-04 04:54 GMT

కొణిజేటి రోశయ్య కు రాష్ట్ర విభజన ఇష్టం ఉండేది కాదు. సమైక్యంగానే ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరుకునే వారు. హైకమాండ్ కు అప్పట్లో పదే పదే చెప్పినా విన్పించుకోకపోవడంతో రోశయ్య సన్నిహితుల వద్ద వాపోయేవారు. వైఎస్ మరణం తర్వాత 2009 సెప్టంబరు 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సీఎంగా రోశయ్య వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. వైఎస్ మరణించడంతో తెలంగాణవాదులు తమ రాష్ట్రం కోసం ఉద్యమాలు నిర్వహించారు.

తెలంగాణ ఉద్యమాన్ని....
ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని హైకమాండ్ రోశయ్యను ఆదేశించింది. అయిష్టంగానే రోశయ్య ఆ సమావేశాన్ని నిర్వహించారు. హైకమాండ్ ను అనేక సార్లు నచ్చ చెప్పాలని చూశారు. కానీ హైకమాండ్ మాత్రం రాష్ట్ర విభజనకే మొగ్గు చూపింది. అయితే తాను ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర విభజన జరగడానికి వీలు లేదని భావించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయలేకపోతున్నారన్న విమర్శలను కూడా రోశయ్య ఎదుర్కొన్నారు. దీంతో హైకమాండ్ సూచన మేరకు పథ్నాలుగు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్య 2010 నవంబరు 24న పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు.


Tags:    

Similar News