ఏపీలో తల్లికి వందనపై కీలక అప్ డేట్
ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం పథకం అమలుపై కీలక అప్ డేట్ వచ్చింది
ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం పథకం అమలుపై కీలక అప్ డేట్ వచ్చింది. మంత్రి డోలా బాలావీరాంజనేయ స్వామి తల్లికి వందనం పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయనున్నామో వెల్లడించారు. ఈ ఏడాది మే నెలలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చదువుకునే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు.
మే నెలనుంచి...
సూపర్ 6 పథకాలను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వెళుతుందన్న మంత్రి రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉన్నా ఇచ్చిన హామీలను అమలుచేస్తున్నామని తెిపారు. ఇందులో భాగంగానే వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం లోనే ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి ప్రకటించారు.