దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
దక్షిణ మధ్య రైల్వే పునర్విభజనలో కీలక అడుగులు పడ్డాయి
దక్షిణ మధ్య రైల్వే పునర్విభజనలో కీలక అడుగులు పడ్డాయి. డివిజన్ల విభజన, సరిహద్దుల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నయి. ఆదాయంపై రైల్వే బోర్డుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇప్పటికే చేరడంతో దీనిపై అధికారులు కసరత్తులు ప్రారంభించి అవసరమైన అన్ని చర్యలు తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.
దక్షిణ కోస్తా రైల్వే డివిజన్...
ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడే దక్షిణ కోస్తా రైల్వేకు జీఎం నియామకం పూర్తయింది. నాలుగు డివిజన్లతో దక్షిణ కోస్తా జోన్ ను ఏర్పాటు చేస్తూ గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రయోజనాలు అందుతాయని, ప్రయాణికుల వసతులు పెరగడంతో పాటు, అవసరమైన రైళ్ల రాకపోకలు కూడా పెరుగుతాయని అంటున్నారు.