Andhra Pradesh : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు హైకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది

Update: 2025-09-26 02:42 GMT

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని అభ్యంతరం తెలుపుతూ స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం హైకోర్టును ఆశ్రయించింది. నిందితులకు బెయిల్ ఇచ్చిన రద్దును రద్దు చేయాలంటూ పిటీషన్ లో పేర్కొంది. దీనిపై నేడు విచారణ జరగనుంది.

నిందితులకు ఇచ్చిన బెయిల్...
ఏసీబీ న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా గోవిందప్పలకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని సిట్ కోరారు. ఏసీబీ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.


Tags:    

Similar News