లిక్కర్ స్కామ్ కేసులో నేడు కీలక తీర్పు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశముంది. నిందితుల బెయిల్ పిటీషన్ లపై నేడు ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశముంది. నిందితుల బెయిల్ పిటీషన్ లపై నేడు ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటీషన్ లపై నేడు ఏసీబీ కోర్టు తీర్పు చెప్పనుంది. అలాగే ఇదే కేసులో మరికొందరు నేతల ముందస్తు బెయిల్ పిటీషన్లపై కూడా తీర్పు చెప్పనుంది.
బెయిల్ పిటీషన్ లపై...
ఇప్పటికే బెయిల్ పిటీషన్లు, ముందస్తు బెయిల్ పిటీషన్లపై విచారించిన న్యాయస్థానం నేడు తీర్పు చెప్పనుంది. గత కొద్ది రోజులుగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి వీరు రిమాండ్ ఖైదీలుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఏసీబీ కోర్టు ఇచ్చే తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరొకవైపు బెయిల్ ఇవ్వవద్దంటూ సిట్ అధికారులు తమ వాదన వినిపించారు.