Breaking : లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. 11 కోట్లు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శంషాబాద్ మండలంలోని ఒక ఫాం హౌస్ లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు

Update: 2025-07-30 02:46 GMT

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శంషాబాద్ మండలంలోని ఒక ఫాం హౌస్ లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో ఎ 40 నిందితుడిగా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ అధికారులు పెద్దమొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ లోని కాచారం సమీపంలోని సులోచన ఫామ్ హౌస్ లో దాచి ఉంచిన పదకొండు కోట్ల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

ఫామ్ హౌస్ లోదాచిపెట్టిన....
ఈ ఫామ్ హౌస్ తీగల బాలిరెడ్డికి చెందిన ఫామ్ హౌస్ గా గుర్తించారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి, చాణక్యలు పదకొండు పెట్టెలతో పదకొండు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు. ఈ నగదు మొత్తాన్ని ఇక్కడ రాజ్ కేసిరెడ్డి ఇచ్చిన సూచనతోనే దాచిపెట్టామని తెలపడంతో వీటిని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


Tags:    

Similar News