ఏపీ కేబినెట్ భేటీ.. 63 అంశాలకు కేబినెట్‌ ఆమోదం

జగనన్న అమ్మ ఒడి పథకాన్ని జూన్ 28వ బటన్‌ నొక్కి తల్లిదండ్రుల ఖాతాల్లో వేయాలని నిర్ణయించారు. 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్

Update: 2023-06-07 09:53 GMT

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశంలో నేడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. మొత్తం 63 అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్ విధాం తీసుకొస్తోంది. దీని కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపకల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. సీపీఎస్ ఉద్యోగుల కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

జగనన్న అమ్మ ఒడి పథకాన్ని జూన్ 28వ బటన్‌ నొక్కి తల్లిదండ్రుల ఖాతాల్లో వేయాలని నిర్ణయించారు. 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్లను బిగించేందుకు కూడా ఓకే చెప్పారు. దీని కోసం రూ. 6,888 కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం రూ. 445 కోట్ల రుణాలు తీసుకు వచ్చేందుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల్లో 706 పోస్టుల భర్తీ, చిత్తూరు డెయిరీ ప్లాంట్ కు 28 ఎకరాల భూమిని లీజు ప్రతిపాదనకు, ఏపీ పౌరసరఫరాల కార్పోరేషన్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ సేకరణ, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఎంవోయులు కుదుర్చుకున్న సంస్థలకు భూకేటాయింపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.


Tags:    

Similar News