Andhra Pradesh : నేడు ఏపీలో కీలక కేసుల విచారణ

నేడు ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానంలో కీలక కేసుల విచారణ జరగనుంది

Update: 2025-11-17 03:29 GMT

నేడు ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానంలో కీలక కేసుల విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో విచారణ కొనసాగనుంది. హైకోర్టులో సజ్జల శ్రీధర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ ను విచారించనుంది. ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్‌ నాయుడు పిటిషన్లపై నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. మరొకవైపు కల్తీ మద్యం కేసులోనూ నేడు విచారణ జరగనుంది.

సంజయ్ బెయిల్ పిటీషన్ పై...
కల్తీ మద్యం కేసులో విచారణ జరగనుంది. నేడు మాజీ మంత్రి జోగిరమేష్ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. జనార్ధన్‌రావు, జగన్‌మోహన్‌రావును రెండోసారి కస్టడీకి కోరుతూ సిట్ అధికారుల పిటిషన్‌ వేశారు. దీనిపైనా నిందితుల బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. మరొకవైపు నేడు ఐపీఎస్ అధికారి సంజయ్‌ బెయిల్ పిటిషన్‌పై ఆదేశాలు ఇవ్వనుంది. నిధుల దుర్వినియోగం కేసులో రిమాండ్‌లో ఉన్న సంజయ్ పిటిషన్‌పై నేడు విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది.


Tags:    

Similar News