ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తమిళ నటుడు సత్యరాజ్ విమర్శించారు. ఇటీవల తమిళనాడు పర్యటనకు వెళ్లిన పవన్ మదురైలో నిర్వహించిన మురుగన్ భక్తుల మానాడు సమావేశంలో ప్రసంగించారు. దేవుడి పేరుతో తమిళనాడులో పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తే ఊరుకోమంటూ సత్యరాజ్ హెచ్చరించారు. మతం పేరుతో ఓట్లు తెచ్చుకోవాలని చూస్తే ఇక్కడ కుదరదన్నారు. పెరియార్ సిద్ధాంతాలను నమ్మే తమని ఎవరూ మోసం చేయలేరని, మీరు పాల్గొన్న సభతో మమ్మల్ని మోసం చేశారనుకుంటే అది మీ తెలివి తక్కువ తనమే అని స్పష్టం చేశారు. తమిళ ప్రజలు తెలివైనవారని ఇక్కడ మీ ఆటలు అసలు సాగవని సత్యరాజ్ అన్నారు.