Srisailam : నేటి నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు

శ్రీశైలంలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి

Update: 2025-10-22 01:58 GMT

శ్రీశైలంలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీశైలంలో నవంబర్‌ 21 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. కార్తీక మాసంలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు రద్దు చేసినట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. కార్తీక మాసంలో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

విడతల వారీగా...
ప్రతి రోజూ విడతలవారీగా మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం ఉంటుందని, శని, ఆది, సోమవారాల్లో కుంకుమార్చనలు నిలుపుదల చేయనున్నట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు నిలుపుదల చేయనున్నారు. అలాగే యథావిధిగా హోమాలు, కళ్యాణాలు నిర్వహిస్తామని శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.


Tags:    

Similar News