పోలీస్ కమిషనర్ కు జోగి రమేష్ ఫిర్యాదు
వైసీపీ నేత జోగి రమేష్ విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు
వైసీపీ నేత జోగి రమేష్ విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై నిజానిజాలను నిగ్గుతేల్చాలని జోగి రమేష్ విజయవాడ పోలీస్ కమిషనర్ ను కోరారు. ఆయన కొద్దిసేపటి క్రితం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన జోగిరమేష్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, సోషల్ మీడియాలో కావాలని కొందరు పోస్టు చేస్తున్నారని ఫిర్యాదు చేస్తున్నారు.
కల్తీ మద్యం కేసులో...
కల్తీ మద్యం కేసులో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై దర్యాప్తు చేయాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ను కోరారు. తన వాట్సాప్ చాట్ పై కూడా దర్యాప్తు చేసి విచారణ చేయాలని జోగి రమేష్ కోరారు. జోగి రమేష్ వెంట మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి కూడా విజయవాడ సీపీని కలిసిన వారిలో ఉన్నారు.