జగన్ పై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2025-07-17 04:32 GMT

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మీడియా సమావేశంపై విరుచుకపడ్డారు. ప్రసన్నకుమార్ ను ఉద్దేశించి మాట్లాడుతున్నావే ఆరోజు ప్రసన్నకుమార్ అక్కపై 12 కేసులు నమోదు చేశారు వారి గురించి ఎవరు మాట్లాడతారని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. నన్ను నా కుమారుడిని జైలుకు పంపావు అయినా బాధపడలేదు ఈరోజు పెద్దారెడ్డి ఊర్లోకి వస్తా అంటే మేము రానివ్వమని చెప్పారు.మీ నాన్న మీ తాత చాలా మంచోళ్ళు నా గురించి అడుగు వాళ్ళు ఏంటో చెబుతారు.నేను మీ తాత అప్పట్లో బొగ్గు బస్సు యజమానులమని జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్ కు గుర్తు చేశారు.

మీ తాతను అడుగు అంటూ...
మీ అమ్మ విజయమ్మ ఆసుపత్రికి వచ్చి ఉంటే నేను వెళ్లి మాట్లాడనని, అది నా సంస్కారం,నా సంస్కారం గురించి మీ నాన్న రాజశేఖర్ రెడ్డి కూడా బాగా తెలుసునని తెలిపారు. ఎస్వీ రవీంద్రారెడ్డి ఐదు సంవత్సరాలు తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వకుండా చేశారని, కిందిస్థాయి కోర్టు నుండి హైకోర్టు వరకు వెళ్ళాడు కానీ అతనిని తాడిపత్రిలో అనుమతించలేదన్నారు. నువ్వు ఎప్పుడైనా లగ్జరీ కార్స్ గురించి విన్నావా లేదా అందులో తిరగావా బహుశా నువ్వు తిరగకబోయి ఉండొచ్చన్నారు. కానీ మీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి లగ్జరీ కార్స్ వాడుతున్నారన్నారు. కేవలం ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే గా చేసిన పెద్దారెడ్డి దగ్గర రేంజ్ రోవర్, బిఎండబ్ల్యూ,ఆడి కార్లు ఉన్నాయని, .ఇవన్నీ తాడిపత్రి ప్రజలను మున్సిపాలిటీవేనని సర్వనాశనం చేసి సంపాదించారన్నారు. తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మూడు సెంట్ల స్థలన్ని ఆక్రమించి కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్రమ ఇంటి నిర్మాణం చేశాడన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.


Tags:    

Similar News