జనసేన వస్తుంది.. అప్పుడే తేల్చుకుందాం

ఇప్పటం గ్రామ ప్రజలకు జనసేన అండగా నిలుస్తుందని పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.

Update: 2023-03-04 07:29 GMT

ఇప్పటం గ్రామ ప్రజలకు జనసేన అండగా నిలుస్తుందని పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. బీమవరం నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. రైతులు ప్రభుత్వానికి ధైర్యంగా నిలబడి తమకు స్థలం ఇచ్చినందుకు కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని నాదెండ్ల ఆరోపించారు. జగన్ పైశాచికానందం కోసం ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడతారన్న నమ్మకంతోనే ఆ గ్రామ ప్రజలు తమ సభకు స్థలాన్ని ఇచ్చారన్నారు.

ఇప్పటం గ్రామంలో...
ఈ ముఖ్యమంత్రికి పరిపాలన చేసే అర్హత లేదన్నారు. ఇప్పటం గ్రామంలో 80 అడుగుల రోడ్డు ఉంటే దాన్ని 120 అడుగుల రోడ్డగా చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. పోలీసులతో తమ పార్టీ కార్యకర్తలను గ్రామంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన ప్రభుత్వం రాబోతుందని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ నెల 14న మచిలీపట్నంలో తమ పార్టీ సభ జరుగుతుండగా అక్కడ సభ నిర్వహణకు స్థలం ఎవరూ ఇవ్వకుండా ఇప్పటంలో మళ్లీ ప్రభుత్వం ఇళ్ల కూల్చివేతను మొదలుపెట్టిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.


Tags:    

Similar News