Pawan Kalyan Bhimavaram: పవన్ భీమవరం పర్యటన వాయిదా

జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడింది. ఆయన రానున్న హెలికాప్టర్ ల్యాండింగ్ కు అధికారులు అనుమతించలేదు.

Update: 2024-02-14 02:01 GMT

Pawan Kalyan Bhimavaram:జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడింది. ఆయన రానున్న హెలికాప్టర్ ల్యాండింగ్ కు అధికారులు అనుమతించలేదు. దీంతో పవన్ కల్యాణ‌్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈరోజు భీమవరంలో పవన్ కల్యాణ్ జనసేన క్యాడర్, లీడర్లతో సమావేశం అవ్వాలని ముందుగానే నిర్ణయించారు. ఏపీలో వరస పర్యటనల కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ ను సిద్ధం చేశారు. నేడు భీమవరం నుంచి పర్యటనలు ప్రారంభం కావాల్సి ఉంది. భీమవరంలోని విష్ణు కళాశాలలో హెలికాప్టర్ ల్యాండింగ్ చేసేందుకు అనుమతిని స్థానిక జనసేన నేతలు కోరారు.

ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వకపోవడంతో...
అయితే అధికారులు హెలికాప్టర్ ల్యాండింగ్ కు అభ్యంతరం తెలిపారు. పోలీసు శాఖ నుంచి అనుమతి లభించినప్పటికీ ఆర్‌అండ్‌బీ శాఖ మాత్రం అనుమతి ఇవ్వలేదు. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్రాంతానికి యాభై మీటర్ల దూరంలో భవనాలు ఉండటంతో వారు అనుమతిని నిరాకరించారు. హెలికాప్టర్ ల్యాండ్ కావాలంటే ల్యాండింగ్ అయ్యే ప్రాంతానికి వంద మీటర్ల దూరంలో ఎలాంటి భవనాలు ఉండకూడదరు. దీంతో వారు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో నేడు పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన రద్దయింది. తిరిగి ఎప్పుడనేది జనసేన నుంచి ప్రకటన రావాల్సి ఉంటుంది.


Tags:    

Similar News