అర్థమవుతోందా.. పవన్ కావాలనే అక్కడికి

ఎన్నికలేమో వచ్చేస్తున్నాయి. సినిమాలు అయితే దాదాపుగా పూర్తయ్యాయి. కొన్ని విడుదల కూడా అయ్యాయి

Update: 2023-08-02 02:04 GMT

ఎన్నికలేమో వచ్చేస్తున్నాయి. సినిమాలు అయితే దాదాపుగా పూర్తయ్యాయి. కొన్ని విడుదల కూడా అయ్యాయి. ఇంకొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఎన్నికల్లో గెలవాలంటే పార్టీ క్యాడర్ కూడా సిద్ధమవ్వాలి. తానొక్కడినే నాయకుడిని అని అనుకుంటూ ముందుకు సాగితే పార్టీకి విజయం వరించడం కష్టమే..! ఏపీ ప్రజలకు, కార్యకర్తలకు దగ్గరగా ఉన్నానని.. అండగా ఉన్నానని చెప్పాలంటే ఏమి చేయాలి అని ఆలోచించాక ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలలోనూ తాను సత్తా చాటుతానని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీకే పరిమితమయ్యారు. ఏపీ కంటే తెలంగాణలోనే ముందుగా ఎన్నికలు వస్తున్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ అక్కడి రాజకీయాలను, తెలంగాణ ప్రాంత ప్రజలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అందుకే ఇప్పుడు పూర్తీగా ఏపీలోనే తన రాజకీయ కలాపాలు అని స్పష్టం చేసేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ను వీడి మంగళగిరికి వచ్చేశారని అంటున్నారు.

ఇన్ని రోజులూ హైదరాబాద్‌ నుంచి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించిన పవన్‌ కళ్యాణ్ ఇకపై మంగళగిరి నుంచే అన్నీ అని చెప్పేశారు. పార్టీ కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి మంగళగిరికి మార్చేశారు. కేంద్ర కార్యాలయ సిబ్బంది, ఫైల్స్, ఇతర విభాగాలు, కంప్యూటర్లను మంగళగిరికి తరలించినట్లు తెలుస్తోంది. పవన్ కూడా ప్రస్తుతం మంగళగిరిలోని బస చేయనున్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్‌ కళ్యాణ్‌కు అనుగుణంగా ఇంటి నిర్మాణం జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదైనా పనులు, సినిమా షూటింగ్ షెడ్యూల్‌లో మాత్రమే పవన్ హైదరాబాద్ వెళ్లనున్నారని సమాచారం. ఇటీవలి కాలంలో పవన్‌తో చర్చలు జరపాలంటే మంగళగిరికే వచ్చారు. అటు రాజకీయ నాయకులైనా, ఇటు సినిమా ఫీల్డ్ కు చెందిన వారైనా మంగళగిరికే వస్తున్నారు. ఇక త్వరలోనే పవన్ కళ్యాణ్ వారాహి మూడో విడత యాత్రకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేయనున్నారు.


Tags:    

Similar News