వైసీపీ ఐసీయూలో ఉంది : పవన్

మచిలీపట్నానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కాపు కులంతోనే అధికారంలోకి రాలేమన్నారు

Update: 2023-10-02 13:34 GMT

మచిలీపట్నానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కాపు కులంతోనే అధికారంలోకి రాలేమన్నారు. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. కాపులు అన్ని కులాల వారినీ కలుపుకుని పోవాలని పిలుపు నిచ్చారు. కులాల ఐక్యత గురించి అందరం కృషి చేయాలన్నారు. మచిలీపట్నం జనసేన పార్టీ కార్యకర్తలతో పవన్ మాట్లాడారు. పార్టీ పెట్టిన వెంటనే తాను ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదన్న పవన్ కల్యాణ్ అభివృద్ధి జరగాలంటే కులాల, మతాలకు అతీతంగా జరగాలన్నారు.

కాపులు పెద్దన్న పాత్ర...
వైసీపీ ఐసీయూలో ఉందన్నారు. అది ఓడిపోయే పార్టీ అని పవన్ కల్యాణ్ అన్నారు. మచిలీపట్నం తనను ఎంతగానో ప్రభావితం చేసిందన్న పవన్ కల్యాణ్ కులాల ఐక్యత గురించి అందరూ కలసి పనిచేయాలన్నారు. జనసేన ఒక కులానికి సంబంధిన పార్టీ కాదని తెలిపారు. తాను కులాలను వెతుక్కుని పనిచేయనని అన్నారు. నాలుగు ఎన్నికల్లో కష్టపడితేనే బీఎస్సీ అధికారంలోకి వచ్చిందని, మనం కూడా కష్టపడితే అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదని పవన్ అన్నారు.
రాజధాని నిర్మాణం...
రాత్రికి రాత్రే రాజధానిని నిర్మించలేమన్నారు. కొన్నేళ్లు కష్టపడితేనే రాజధాని నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. అంచెలంచెలుగా రాజధాని నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ కుమారుడిననే జగన్ ను జనం నమ్మారని అన్నారు. జగన్ తనకు తనకు శత్రువు కాదని, రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని పవన్ అన్నారు. తెలంగాణ కోసం పుట్టిన టీఆర్ఎస్ దశాబ్దంలోనే అధికారంలోకి వచ్చిందన్నారు. జనసేన అధికారంలోకి వస్తే అందరికీ మంచి చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. జనసేన, టీడీపీ కలసి పోటీ చేస్తాయని ఆయన తెలిపారు. పరస్పసరం సహకరించుకుంటేనే జగన్ ను ఓడించగలమని పవన్ అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News