Pawan Kalyan : పవన్ నోటి నుంచి అల్లు అర్జున్ పేరు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అల్లు అర్జున్ పేరును ప్రస్తావించారు. కంకిపాడులో జరిగిన పల్లెపండగ సభలో ఆయన మాట్లాడారు
Pawan Kalyan
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అల్లు అర్జున్ పేరును ప్రస్తావించారు. కంకిపాడులో జరిగిన పల్లెపండగ సభలో ఆయన మాట్లాడుతూ సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు రాష్ట్రాభివృద్ధి చేయాలని, ఆ తర్వాతనే విందులు, వినోదాల గురించి ఆలోచించాలని పవన్ కల్యాణ్ అన్నారు. సినిమాలకు వెళ్లాలంటే అందరి వద్ద డబ్బులుండాలని పవన్ కల్యాణ్ అన్నారు. దీంతో పాటు సినిమాకు వెళ్లాలంటే రహదారులు బాగా ఉండాలని, వాటిని అభివృద్ధి చేసుకోవడంపైనే ముందు దృష్టిపెడదామన్నారు.
హీరోలంటే.. తనకు...
సినిమా అంటే తనకు గౌరవం, ప్రేమ అన్న పవన్ కల్యాణ్, తనకు ఏ హీరో పై భిన్నాభిప్రాయం లేదన్నారు. అందరి హీరోలను గౌరవిస్తానని తెలిపారు. బాలకృష్ణ, చిరంజీవి, తారక్, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని వంటి వారి పేర్లను ప్రస్తావించి వీరంతా తనకు కూడా ఇష్టమేనని అన్నారు. అయితే సినిమా రంగం అభివృద్ధి చెందాలంటే ముందుగా రాష్ట్రాభివృద్ధి అవసరం అని, ఆర్థికంగా అందరం బలోపేతం కావాలని పవన్ కల్యాణ్ ఈ సభలో ఆకాంక్షించారు. ఉపాధి హామీ పనుల ద్వారా ఆదాయం పొందవచ్చని పవన్ కల్యాణ్ తెలిపారు.