వైసీపీకి పవన్ సూటి ప్రశ్న ఇదే

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Update: 2022-09-21 12:30 GMT

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పేరు మార్చడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం సహేతుకమైన వివరణ ఇవ్వాలని కోరారు. ఎన్టీఆర్ పేరు బదరులు వైఎస్సార్ పేరు పెితే విశ్వవిద్యాలయంలోనూ, రాష్ట్రంలోనూ వైద్య వసతులు మెరుగవుతాయా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ తగిన సౌకర్యాలు లేవన్నారు. కోవిడ్ సమయంలోనూ దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ ను వేధించిన కారణంగానే ఆయన మరణించారని పవన్ గుర్తు చేశారు.

కేజీహెచ్ పేరు మార్చండి...
ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపర్చడాన్ని పక్కన పెట్టి పేరు మార్చడంలో అర్థం లేదని పవన్ కల్యాణ్ అభిప్రాయ పడ్డారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ పేరు మార్చడం అని పిస్తుందని ఆయన అన్నారు. కొత్త వివాదాలు సృష్టించి ఉన్న సమస్యలను మరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుందన్నారు. విశాఖలో కింగ్ జార్జి ఆసుపత్రి పేరు మార్చవచ్చు కదా? ఇంకా ఆ పేరు బ్రిటీష్ వాసనలతోనే ఉందని పవన్ ప్రశ్నించారు. ఆజాదీకా అమృతోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో విశాఖ కేజీహెచ్ పేరును మార్చి మరో మహానుభావుడి పేరు పెట్టాలని పవన్ కల్యాణ్ కోరారు.


Tags:    

Similar News