Nagababu : నేడు జనసేన నేత నాగబాబు నామినేషన్

జనసేన నేత నాగబాబు నేడు ఎమ్మెల్సీగా నామినేషన్ వేయనున్నారు

Update: 2025-03-07 04:19 GMT

nagababu

జనసేన నేత నాగబాబు నేడు ఎమ్మెల్సీగా నామినేషన్ వేయనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈరోజు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అవుతున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించిన సంగతి తెలిసిందే.

మంత్రివర్గంలోకి కూడా...
నాగబాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రివర్గంలోకి తీసుకోవాలని కూడా కూటమి నేతలు నిర్ణయించిన నేపథ్యంలో నేడు నామినేషన్ వేయనున్నారు. ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాలు కూటమి ఖాతాలోనే పడనున్నాయి. ఈ నెలలోనే నాగబాబు మంత్రిపదవిని చేపట్టే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News